నగరంలో కత్తితో యువకుడిపై దాడి
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి సమీపంలో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. రఘుపతి అనే యువకుడిపై మరో యువకుడు వివేక్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రఘుపతికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, వివేక్ దాడి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.