VIDEO: బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. టీచర్‌కు దేహశుద్ధి..!
KMM: ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికలను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు సదరు వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.