సింగనమల టీడీపీలో వర్గ విభేదాలు
అనంతపురం: టీడీపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. సింగనమల మండలం నాగులగడ్డ తండాలో సీసీ రోడ్లను చేపట్టే విషయంలో వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే వర్గం పనులు చేపట్టడంతో మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.