విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం స్తంభాలగరువులో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసి, వారి ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.