VIDEO: జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం
అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్,అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చిన్నపాటి గొడవలు, మనస్పర్థల కారణంగా దంపతులు విడిపోయి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని ఎస్పీ సూచించారు. క్షణికావేశంలో విడిపోయే దంపతులను కలిపి,వారికి రక్షణ కల్పించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.