రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
గుంటూరు: రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. పీ.జీ.ఆర్.ఎస్‌లో వచ్చిన ఆర్జీలను నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షిస్తూ, ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పీ.జీ.ఆర్.ఎస్‌ను నామమాత్రంగా నిర్వహించకూడదని, ఎస్.ఎల్.ఏ గడువు దాటకుండా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.