BREAKING: రాష్ట్రాలకు కేంద్రం తీవ్ర హెచ్చరిక

BREAKING: రాష్ట్రాలకు కేంద్రం తీవ్ర హెచ్చరిక

ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలపై వడగాల్పుల ప్రభావం ఉందని హెచ్చరించింది. అధిక ఎండలకు తోడు వేడిగాలులు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలను రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అధికంగా నీళ్లు తాగాలని చెబుతున్నారు.