VIDEO: బంక్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

VIDEO: బంక్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

మేడ్చల్: బోయిన్‌పల్లిలోని ఓ పెట్రోల్ బంక్‌లో బుధవారం ఉన్నట్లుండి రెండు బైకుల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బంక్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి భారీ ప్రమాదాన్ని తప్పించారు. కాగా, రెండు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరికీ ఏం కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. సరైన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన బంక్ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.