VIDEO: 'కాలినడకన తిరుమలకు ఎంపీ దంపతులు'

NDL: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు ఆదివారం తిరుమలకు బయలుదేరారు. తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి, సోమవారం తెల్లవారుజామున VIP బ్రేక్ దర్శనంలో శ్రీ వారిని దర్శించుకుంటారని కార్యాలయం సిబ్బంది తెలిపారు.