బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేత
NTR: ఏ.కొండూరు(M) రామచంద్రపురంలో అత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆదివారం పరామర్శించారు. వరుసకు చెల్లిలైన బాధితురాలిపై రేప్ జరగడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు.