AMC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రమ

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని రైతులకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో AMC ఛైర్మన్‌గా యారవ రమ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలందించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.