సర్పంచ్ బరిలో భార్యా భర్తలు
BHPL: గణపురం మండలం గొల్లపల్లి సర్పంచ్ ఎన్నికలో అనూహ్య పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బలపరిచిన అరుణ్ ప్రధాన అభ్యర్థిగా నామినేషన్ వేయగా, భార్య గీతాంజలి డమ్మీగా వేశారు. ఉపసంహరణ సమయంలో గీతాంజలి అందుబాటులో లేకపోవడంతో ఆమెను తుది జాబితాలో చేర్చారు. దీంతో భార్యాభర్తలిద్దరూ సర్పంచ్ బరిలో నిలవాల్సి వచ్చింది. ఈ విషయంతో గ్రామంలో చర్చనీయాంశమైంది.