VIDEO: 'గొల్ల, కురుమల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

SRPT: గొల్ల, కురుమల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య కోరారు. సోమవారం తుంగతుర్తిలో జీఎంపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వం గొల్ల, కురుమలకు రెండో విడత నగదు బదిలీ చేస్తామని డీడీలు కట్టించుకుని వారిని అనేక విధాల నష్టం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.