ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ సెంటర్‌లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని పేర్కొన్నారు.