నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

AP: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. అవిశ్వాసానికి 40 మంది కార్పొరేటర్లు అనుకూలంగా సంతకాలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లాకు కార్పొరేటర్లు ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీసును ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 మంది సభ్యులు ఉండగా.. డిప్యూటీ మేయర్ ఖలీల్ రాజీనామాతో ఒక స్థానం ఖాళీ అయ్యింది.