ORRపై ఘోర ప్రమాదం.. డీసీఎంను ఢీకొన్న కారు

ORRపై ఘోర ప్రమాదం.. డీసీఎంను ఢీకొన్న కారు

TG: హైదరాబాద్ ORRపై నార్సింగి-TSPA సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న డీసీఎంను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వల్ల ORRపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వాహనాలను క్లియర్ చేస్తున్నారు.