కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

ATP: బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చెక్ పోస్ట్ సమీపంలో ఇవాళ బీటీపీ కుడి కాలువలోకి ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న వ్యక్తి నీటిలో మునిగి ఊపిరాడక మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.