'దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రేపు ప్రజవాణి'
NLG: దివ్యాంగులు సమస్యల పరిష్కారానికి రేపు కలెక్టరేట్‌లో 'ప్రత్యేక ప్రజావాణి' నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బాధితులు నేరుగా కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.