సమ్మక్క, సారలమ్మ జాతర.. వేములవాడలో ముమ్మర ఏర్పాట్లు
SRCL: సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం కోడె ఉచిత దర్శనం, రూ.100 ప్రత్యేక దర్శనం, రూ.300 అతి శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఈవో రమాదేవి పర్యవేక్షిస్తున్నారు.