నాగర్ కర్నూల్ MP టికెట్ మల్లు రవికేనా?

నాగర్ కర్నూల్ MP టికెట్ మల్లు రవికేనా?

నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జనభర్జన పడ్డ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు అభ్యర్థి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతుంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించగా, చివరకు ఎంపీ టికెట్టు మల్లు రవికి దక్కినట్లు ఆయన అనుచరులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు.