'ప్రభుత్వ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

KNR: ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న శిక్షణలను సద్వినియోగం చేసుకుని రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అల్ఫోర్స్ విద్యా సంస్థ సహకారంతో రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్‌లో శిక్షణ ఇస్తున్నారు.