రోడ్డు ప్రమాద బాధితుడికి మంత్రి సుభాష్ చేయూత

రోడ్డు ప్రమాద బాధితుడికి మంత్రి సుభాష్ చేయూత

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామానికి చెందిన కుదురు శ్రావణ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు, ఒక చేయి విరిగి ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని కష్టం తెలుసుకున్న మంత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన తల్లి జ్యోతికి మంత్రి సుభాష్ పదివేల రూపాయల చెక్కును సోమవారం ఆర్థిక సాయం అందించారు.