'బసవేశ్వరుడి ఆశయాలను కొనసాగించాలి'
PDPL: బసవేశ్వరుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. ఆయన ఇవాళ బసవేశ్వరుడి జయంతి వేడుకలో పాల్గొని, నివాళులు అర్పించారు. సమాజంలోని కుల వ్యవస్థ, అసమానతలు తొలగించడానికి కృషిచేసిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు అని కొనియాడారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.