చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత
మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా, మార్చి 3వ తేదీన మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయన్నారు. గ్రహణం ముగిసిన తర్వాత, ఆలయ శుద్ధి మరియు సంప్రోక్షణ పూజలు నిర్వహించి, భక్తులకు సాధారణ దర్శనం కల్పించబడుతుందని పేర్కొన్నారు.