రాజీ మార్గమే రాజా మార్గం: SI దివ్య

రాజీ మార్గమే రాజా మార్గం: SI దివ్య

HNK: జిల్లా కోర్టులో ఈ నెల 15న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు భీమదేవరపల్లి మండల SI దివ్య తెలిపారు. ఇవాళ SI మాట్లాడుతూ.. సివిల్, బ్యాంక్ రికవరీలు, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆస్తి తగాదాలు వంటి కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.