VIDEO: 'రైతులు పామాయిల్ సాగుపై మొగ్గు చూపాలి'
ELR: రైతులందరూ పామాయిల్ సాగుపై మొగ్గు చూపాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కోరారు. జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పామాయిల్ రైతులకు గరిష్టంగా 24,000 రూపాయల గిట్టుబాటు ధర లభిస్తోందని భవిష్యత్తులో 50,000 అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. పామాయిల్‌కు భవిష్యత్తులో మంచి గిరాకీ ఏర్పడుతుందన్నారు. పంటకు ఒకసారే పెట్టుబడి పెట్టాలన్నారు.