ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా పడింది. ప్రకాశం జిల్లా దేవరకొండకు చెందిన 15 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మొదటి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరిలో సుహాసిని, సాన్వికలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.