అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నాం: ఎమ్మెల్యే పులపర్తి
WG: నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం పట్టణంలోని 5 వార్డులలో సుమారు రూ.కోటి 2 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు గురువారం ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.