పెందుర్తిలో కార్డన్ సెర్చ్
VSP: నగర సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఇవాళ పెందుర్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి, సరైన ధృవపత్రాలు లేని 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.