గోల్కొండ ఉత్సవాల్లో 100 మంది పోతరాజుల డాన్స్

HYD: గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనాల ఉత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. ముఖ్యంగా పోతరాజుల నృత్య ప్రదర్శన అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. సాయి గౌడ్, కృష్ణ గౌడ్, నిఖిల్ గౌడ్ బృందం సభ్యులు కలిసి దాదాపుగా వందమంది పోతరాజులతో చేసిన డాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. గోల్కొండ గల్లీల్లో బోనాల ఉత్సవాలు మిన్నంటాయి.