సంక్షోభానికి ఇండిగో బాధ్యత వహించాలి: కేంద్ర మంత్రి

సంక్షోభానికి ఇండిగో బాధ్యత వహించాలి: కేంద్ర మంత్రి

AP: ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఈ సంక్షోభానికి ఇండిగో బాధ్యత వహించాలన్నారు. సేవలు క్రమంగా సాధారణస్థితికి చేరుతున్నాయని చెప్పారు. రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్, లగేజీ విషయాలతో పాటు ఎయిర్‌పోర్టుల్లో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.