VIDEO: వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
కృష్ణా: మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసినా జగన్ అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. బారికేడ్లను దాటి, పోలీసుల నియంత్రణను ఎదురించి జగన్ పర్యటనలో పాల్గొంటున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.