బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
NLG: 'చలో అసెంబ్లీ' ముట్టడి నేపథ్యంలో చండూరులో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆరు గ్యారంటీల అమలును కోరుతుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు దిగడం అన్యాయమని నాయకులు మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇరిగి రామకృష్ణ, లింగస్వామి, స్వామి, సతీష్ తదితరులు ఉన్నారు.