బాధితులకు నిత్యవసర సరుకులు అందజేసిన ఇంఛార్జ్

బాధితులకు నిత్యవసర సరుకులు అందజేసిన ఇంఛార్జ్

VZM: ఇటీవల తెర్లాం మండలం కే.సీతారాంపురం గ్రామంలో అగ్నిప్రమాదంలో కాలిపోయిన 12 ఇళ్లను ఇవాళ బొబ్బిలి జనసేన పార్టీ ఇంఛార్జ్ గిరడ అప్పలస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.