కనిగిరి సచివాలయాల్లో తనిఖీ చేసిన కమిషనర్

ప్రకాశం: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి విధులు బాధ్యాయుతంగా నిర్వర్తించాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరిలోని గార్లపేటరోడ్డు, కాశిరెడ్డి బజారు, పామూరు రోడ్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు కమిషనర్ మాట్లాడుతూ.. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.