భారీగా గంజాయి దహనం
AKP: పరవాడ మండలం రామ్ కీ ఫార్మా సిటీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈగల్ వింగ్ సంయుక్తంగా భారీ స్థాయిలో గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన సుమారు 1108 కిలోల గంజాయిని ఇవాళ శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. పట్టుబడిన మత్తు పదార్థాలను ఎప్పటికప్పుడు కోర్టు అనుమతితో ధ్వంసం చేస్తామని వారు పేర్కొన్నారు.