సినిమా వీడియోలతో అవగాహన

సినిమా వీడియోలతో అవగాహన

కృష్ణాజిల్లా పోలీసులు సినిమా వీడియోలుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింకులు ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. లావాదేవీ ముందు లింకులు నిజమైనవో కాదో పరిశీలించాలని చెప్పారు. బ్యాంక్ వివరాలు, OTP, కార్డ్ నంబర్లు ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. మోసపోతే 1930లో కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు.