‘63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు'
KMM: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ తెలిపారు. మూడో విడత పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.