అద్దంకి జాతీయ రహదారిపై రైతుల ధర్నా..!

అద్దంకి జాతీయ రహదారిపై రైతుల ధర్నా..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ శెట్టిపాలెం వద్ద అద్దంకి, నార్కట్ పల్లి హైవేపై రైతులు ధర్నా నిర్వహించారు. మిల్లర్లు సిండికేట్ అయి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మిల్లులలో నిలువ ఎక్కువగా ఉంది అంటూ కొనుగోలు చేయకుండా మిల్లులు మూసి వేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.