ఫార్మర్ రిజిస్ట్రీపై రైతులకు అవగాహన
WNP: వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామ పంచాయతీ వద్ద కేంద్ర ప్రభుత్వ 'ఫార్మర్ రిజిస్ట్రీ' కార్యక్రమంపై జూమ్ సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, ఏఈవో మోహన్ కుమార్ రెడ్డి రైతులకు నమోదు విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.