'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి'
NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యాన్నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.