రేపే మూడో విడత ఎన్నికలు.. సర్వం సిద్ధం

రేపే మూడో విడత ఎన్నికలు.. సర్వం సిద్ధం

TG: రాష్ట్రంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.