నేటి నుంచే సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు
NGKL: చారకొండ మండలం సిర్సనగండ్లలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనున్నాయి. నేడు పల్లకి సేవ, స్వామివారి ఎదుర్కోల్, రేపు సీతారామచంద్రస్వామి కళ్యాణం, మార్చి 28న చిన్న రథోత్సవం, మార్చి 29న గరుడసేవ, మార్చి 30న ప్రధాన ఘట్టమైన పెద్ద రథోత్సవం, ఏప్రిల్ 1న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి.