అద్దె భవనాల్లో పరిపాలన… ప్రజలకు ఇబ్బందులు

అద్దె భవనాల్లో పరిపాలన… ప్రజలకు ఇబ్బందులు

MBNR: పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో రాజాపూర్, మూసాపేట, మహమ్మదాబాద్, కౌకుంట్ల మండలాలు ఏర్పాటయ్యాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటివరకు సొంత భవనాలు లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రైవేట్ భవనాలకు అద్దె చెల్లించే నిధులతో సొంత భవనాలు నిర్మాణమయ్యేవని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.