పేకాట శిబిరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

VZM: డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని అక్కివరం గ్రామ సమీపంలోని బి.బి.జీ. లే అవుట్‌లో జూదం ఆడుతున్నారన్నా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.15,100, 2 ఆటోలు, 4 ద్విచక్ర వాహనాలు, ఎనిమిది చరవాణులలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.