నేటి నుంచి భద్రాచలంలో భాద్రపద మాసోత్సవాలు

నేటి నుంచి భద్రాచలంలో భాద్రపద మాసోత్సవాలు

BDK: శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసోత్సవాలు జరగనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ తలుపులు మూసివేసి, మరుసటి రోజు సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు.