మాగుంట సమక్షంలో టీడీపీలోకి చేరికలు

ప్రకాశం: గిద్దలూరు లోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కంభం పట్టణానికి చెందిన 250 మైనార్టీ కుటుంబాలు శనివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. టీడీపీకి మద్దతుగా నిలిచి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.