మృతుల్లో మావోయిస్టు అగ్రనేత
ASR: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఉన్నట్లు సమాచారం. ఆయన మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావును గుర్తించారు. అయితే దేవ్ జీ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.