'ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'
SKLM: మెలియాపుట్టి మండలం వెంకటాపురం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు.