నామినేషన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ
SRCL: ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలలో ఎస్పీ మహేష్ బీతే గురువారం పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ సెంటర్స్‌తో పాటుగా పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్ పోస్ట్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలకు తగు సూచనలు చేశారు.